బాలీవుడ్ లో తెరకెక్కిన ఆందోళన్,మాఫియా వంటి చిత్రాల ద్వారా భారతీయ ప్రేక్షకులకి పరిచయమైన నటి సోమీ అలీ(somi ali).పాకిస్థాన్ కి చెందిన ఈ భామ సల్మాన్ ఖాన్(salman khan)తో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యింది. కొంత భాగం షూటింగ్ కి జరుపుకున్న ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలోనే సల్మాన్,సోమీ లు ప్రేమలో పడ్డారని వార్తలు అప్పట్లో చాలానే వచ్చాయి. అందుకు బలం చేకూరేలా ఇద్దరు కలిసి మూడేళ్ళ పాటు డేటింగ్ కూడా చేసారు.ముంబైలోని సల్మాన్ ఇల్లు గెలాక్సీ లోనే సోమి అలీ ఉంది.
తాజాగా సోమి అలీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను బాలీవుడ్ లో వర్క్ చేస్తున్నప్పుడు దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ గురించి చాలా మంది నటులు మాట్లాడుకోవడం విన్నాను. కాకపోతే వాళ్ళందరూ అండర్ వరల్డ్ అని సంబోధిస్తూ ఉంటారు.ఒకరోజు సల్మాన్ కి అండర్ వరల్డ్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎవరు చేసారో తెలియదు గాని నేనే లిఫ్ట్ చేసి మాట్లాడాను. సల్మాన్ కి చెప్పు ఆయన ప్రియురాలని కిడ్నాప్ చేస్తున్నామని చెప్పారు. అప్పుడు ఆ మాటలు నన్నెంతో భయపెట్టాయి.సల్మాన్ కి కూడా విషయం చెప్పగానే చాలా భయపడ్డాడు. ఆ తర్వాత సల్మాన్ ఏం చేసాడో తెలియదు గాని పరిస్థితులు చక్కబడ్డాయి.
ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని సల్మాన్ ని చాలా సార్లు అడిగితే ఈ విషయాలకి ఎంత దూరంగా ఉండే అంత మంచిదని చెప్పాడని అంది.సల్మాన్ ని చంపుతామని కొంత మంది బహిరంగంగా ప్రకటించిన వేల సోమి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.